అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: శాంతాను మహాపత్ర.. పేరు గొప్పగా ఉంది కదూ.. పని అంతకంటే గొప్పది.. జల వనరుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగం.. కానీ ఒడిశాలోని మారుమూల ఆదివాసీ ప్రాంతంలో విధులు.. చూడడానికి బక్కచిక్కిన ప్రాణం.. “ఆ ఇంకేముంటుందిలే, అటవీ ప్రాంతంలో ఎంత గానో కష్టపడుతున్నాడో పాపం” అని అనిపిస్తుంది కదూ.. నిజమే, కాకపోతే ఆ కష్టం తన ఆస్తులు కూడగట్టడానికి మాత్రమే.. కట్ చేస్తే..
మల్కాన్దిరి జిల్లాలోని అతని ఇంట్లో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూశాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల నోట్లు దొరకడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.

ఆదాయానికి మించి ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేయగా, పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు చూసి షాకయ్యారు. వాటిని చేతులతో లెక్కించలేమని, ఏకంగా కౌంటింగ్ మెషిన్ తెప్పించారు. లెక్కించి.. 1.97 కోట్లు ఉన్నట్లు తేల్చారు. నగదుతో పాటు గోల్డ్ కూడా సీజ్ చేశారు. వీటికి తోడు కార్లు, బీమా, డిపాజిట్లు, పెట్టుబడులకి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఎలా సంపాదించాలని దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మహాపాత్ర బంధువులు నివసించే మల్కన్జరి, కటక్, భువనేశ్వర్ సహా ఏడు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో.. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, పది మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఏఎస్సైలు పాల్గొన్నారు.