అక్షరటుడే, ఆర్మూర్: పట్టణం​లోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. గైనకాలజిస్ట్ వసంతకుమారి స్త్రీలలో వచ్చే అనారోగ్య సమస్యలు, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించారు. దంత వైద్యులు హనుమంత్ రెడ్డి, ప్రణతి విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రజనీష్, రాస ఆనంద్, పుష్పాకర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ చంద్రిక, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ సుజాత, హెల్త్ సూపర్​వైజర్​ సంతోషి, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ చైతన్య శాంతి పాల్గొన్నారు.