అక్షరటుడే, వెబ్​డెస్క్​: మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జ్యూడీషియల్​ రిమాండ్​లో ఉన్న మస్తాన్​ సాయిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరారు. కాగా డ్రగ్స్ టెస్టులో మస్తాన్ సాయికి పాజిటివ్ వచ్చింది. మరోవైపు ఆయన ఫోన్​ను పోలీసులు సీజ్​ చేశారు. అందులో వేల మంది అమ్మాయిల కాంటాక్ట్​లు ఉన్నట్లు గుర్తించారు. మస్తాన్​ సాయి డ్రగ్స్​ పార్టీలు నిర్వహించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పోలీసులకు హార్డ్​ డిస్క్ అందించిన లావణ్య

మస్తాన్​ సాయి కేసులో రాజ్​తరుణ్​ మాజీ ప్రియురాలు లావణ్య హార్డ్​ డిస్క్​ను పోలీసులకు అందజేసింది. అందులో డ్రగ్స్​ పార్టీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. అమ్మాయిలు గంజాయి, డ్రగ్స్​ తీసుకుంటున్న వీడియోలు ఉన్నాయని తెలుస్తోంది. కేసులో ఈ హార్డ్​డిస్క్​ కీలకం కానుంది.