అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వరాలయం నుంచి 35 మంది శివస్వాములు గురువారం పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట మంగళ హారతులతో మహిళలు వారికి స్వాగతం పలికారు. గురుస్వామి సుభాష్, ఆనంద్ కుమార్, హన్మాండ్లు, సుదీర్, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.