అక్షరటుడే, ఇందూరు: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు చక్రపాణి కోరారు. గురువారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ కిరణ్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాధా కుమార్, రమేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.