అక్షరటుడే, నిజాంసాగర్: నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని నిజాంసాగర్ మండల వైద్యాధికారి రోహిత్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక పీహెచ్సీలో నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారు మాత్రలు వేసుకోవాలని చెప్పారు.