అక్షరటుడే, నిజాంసాగర్: కారు టైరు పేలి బోల్తా పడిన ఘటన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి బాన్సువాడకు ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి – నాందేడ్ – అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం బ్రాహ్మణపల్లి శివారులో టైరు పేలి బోల్తా పడింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా స్వల్ప గాయాలతో బాన్సువాడలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.