అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల నెలకొల్పుతానని చెప్పి విస్మరించిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. అన్ని సమస్యలను మండలిలో ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్సీ రామచంద్ర రావు, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.