అక్షరటుడే, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పదని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా బీసీ కులగణన బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పుట్నాల శ్రీనివాస్, పండ్ల రాజు, సందీప్, ప్రవీణ్ కుమార్, శ్రీధర్, భాస్కర్ పాల్గొన్నారు.