అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురికి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. టాస్క్​ఫోర్స్​ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీప్రియ నగర్​లోని కస్తూర్బా కాలనీలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్​ఫోన్లు, రూ.30,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రూరల్​ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.