అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాలకు పంపించాలని ప్రధానోపాధ్యాయుడు అయ్యల సంతోష్ అన్నారు. మండలంలోని సోమేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులను ఎవరైనా పనికి పంపిస్తే చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఉమేరొద్దీన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.