అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రజలు వరుసగా మూడోసారి అధికారమిచ్చారని.. మా సమయంతా దేశసేవ కోసమే వినియోగిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఇంతపెద్ద దేశంలో మూడోసారి అవకాశం ఇవ్వడమంటే మేం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించినట్లేనన్నారు. ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’తో కాంగ్రెస్‌కు వస్తున్న ఇబ్బంది ఏమిటీ మాకు తెలియట్లేదన్నారు. ‘ఫ్యామిలీ ఫస్ట్‌ అనేది కాంగ్రెస్‌ విధానమని.. నేషన్‌ ఫస్ట్‌ అనేది బీజేపీ విధానమని ఆయన పేర్కొన్నారు. విక​లాంగుల అభివృద్ధి కోసం బీజేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.