అక్షరటుడే, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిరాజ్ 2000 ఫైటర్‌జెట్ గురువారం కూలిపోయింది. శిక్షణకు సంబంధించిన ఈ విమానం ప్రమాదవశాత్తు శివపురిలోని ఓ పంటపొలంలో కూలింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు.