అక్షరటుడే, ఇందూరు: జాతీయస్థాయి నెట్​బాల్​ పోటీలకు అంక్సాపూర్​కు చెందిన రఘురాం ఎంపికయ్యారు. ఈ నెల 7 నుంచి 14 వరకు ఉత్తరాఖండ్​లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయని రాష్ట్ర నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్య రెడ్డి తెలిపారు. రఘురాం ప్రస్తుతం కామారెడ్డి జిల్లా హస్గుల్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.