అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం క్రీడాపోటీలు నిర్వహించారు. మేరా యువ భారత్​ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ, నస్రుల్లాబాద్​, బీర్కూర్​ యువతకు ఎన్​వైకే ఆధ్వర్యంలో క్లస్టర్​ ఆఫ్​ బ్లాక్​ స్పోర్ట్స్​ మీట్​ నిర్వహించారు. క్రీడాకారులకు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, 200 మీ రన్నింగ్ పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భూలక్ష్మి, ఎస్ఎస్ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఎన్​వైకే వలంటీర్​ సునీల్ రాథోడ్, చిరంజీవి, కృష్ణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.