అక్షరటుడే, బాన్సువాడ: మనస్థాపంతో ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన వల్లెపు చిన్న పోశెట్టి(23) భార్య మూడేళ్ల క్రితం అతడిని వదిలి వెళ్లిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మనస్థాపంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోశెట్టి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతుడి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.