అక్షరటుడే, ఆర్మూర్: డ్రంకన్​ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు ఎస్​హెచ్​వో సత్యనారాయణ తెలిపారు. రెంజల్ మండలం సారంగాపూర్​కు చెందిన ఖురేషి మద్యం తాగి వాహనం నడుపుతూ ఆర్మూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గంగాధర్ ఎదుట హాజరుపర్చగా జైలు శిక్ష వేశారన్నారు.