అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థినులకు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కల్పించారు. డోంగ్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ప్రసన్న రాణి మహిళల ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్, ఒత్తిడి నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత విభాగం అధికారిణి రేవతి, ప్రిన్సిపాల్ అశోక్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం, యోగా శిక్షకురాలు సుప్రియ, ఐక్యుఏసీ కో-ఆర్డినేటర్ రమేష్ బాబు పాల్గొన్నారు.