అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు తెలిపారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ సబ్​ప్లాన్ సీఆర్​ఆర్​ ఫండ్స్ నుంచి నూతన సీసీ రోడ్లు, సీసీ డ్రైయిన్స్​లకు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. ఈ నిధులతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 99 గ్రామాల్లో ఎస్సీ కాలనీల్లో రోడ్లకు మోక్షం లభించనున్నట్లు తెలియజేశారు.