అక్షరటుడే, ఇందల్వాయి: ఎస్సీ వర్గీకరణకు బీఆర్​ఎస్​ పార్టీ మద్దతు తెలపకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్​ చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్​ ఇందల్వాయి మండలాధ్యక్షుడు నవీన్​గౌడ్​ అన్నారు. కాంగ్రెస్​కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఇలా చేశారని విమర్శించారు. పేద ప్రజలు బాగుపడడం ఆ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు.