అక్షరటుడే, ఆర్మూర్: ఆటోను లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శ్రీనగర్​ వద్ద చోటు చేసుకుంది. మాక్లూర్​కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొంది. దీంతో వారు ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.