అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ఏఐసీసీ అధినాయకులతో తెలంగాణ నేతలు శుక్రవారం భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేపు 11 గంటలకు రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు.. మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించారు. దీంతో రేపటి ఢిల్లీ టూర్ సర్వత్రా ఆసక్తిగా మారింది.