తడి, పొడి చెత్తపై అవగాహన

0

అక్షరటుడే, ఆర్మూర్‌ : పట్టణంలోని రాంమందిర్‌ ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గజానంద్‌ తడి, పొడి చెత్త, హానికర చెత్త, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.