అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా సాగుతోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ప్రస్తుతం బీజేపీ 46 స్థానాల్లో, ఆప్​ 24 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్​ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. మరోవైపు అరవింద్​ కేజ్రీవాల్​ ఓటమి పాలయ్యారు.