అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఓడిపోయాడు. న్యూఢిల్లీ స్థానంలో ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్​ వర్మ విజయం సాధించాడు. మరోవైపు మాజీ మంత్రి, లిక్కల్​ స్కాం కేసులో జైలుకు వెళ్లొచ్చిన మనీష్​ సిసోడియా కూడా జంగ్​పూరా​లో ఓడిపోయాడు. కేజ్రీవాల్​పై విజయం సాధించిన పర్వేశ్​ వర్మ కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి అమిత్​షాను కలవనున్నారు.