అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: బీఆర్ఎస్, బీజేపీలు దళిత, బహుజన వ్యతిరేక పార్టీలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ఆ రెండు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీల నాయకులు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.