అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇన్​ఛార్జిగా ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. కీలకమైన జంగ్​పురా స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్​ సింగ్​ గెలుపొందారు. అలాగే ఆర్​కే పురం స్థానంలో అనిల్​ శర్మ విజయం సాధించారు. పార్టీ గెలుపుకోసం కృషి చేసి అర్వింద్​కు అభ్యర్థులు తర్విందర్​ సింగ్​, అనిల్​ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ వారిని సన్మానించారు.