అక్షరటుడే, వెబ్‌డెస్క్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్నాయి. మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అల్లర్లలో 300 మంది వరకు చనిపోయారు. వాటిని నియంత్రించడంలో సీఎం బీరేన్‌సింగ్ విఫలమయ్యారు. దీంతో ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖలు రాశారు. ఈ క్రమంలో శనివారం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన ఆయన ఆదివారం రాజీనామా చేశారు.