అక్షరటుడే, హైదరాబాద్‌: భారత రాజ్యాంగం ప్ర‌సాదించిన హక్కుల‌ను, గ్యారంటీలను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రఖ్యాత మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి ఆధ్వర్యంలో తిరువ‌నంత‌పురంలో ఏర్పాటు చేసిన “మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌” స‌ద‌స్సు (MBIFL 2025)లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. మాతృభూమి ఎడిట‌ర్ మ‌నోజ్ కె.దాస్‌, కొందరు సభికులు ముఖాముఖి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌మాధానాలిచ్చారు.