అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. నక్సలిజం వల్ల దేశంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదన్నారు. నక్సల్స్ రహిత భారత్ గా మార్చేందుకు భద్రతా బలగాలు 31 మంది నక్సలైట్లను హతమార్చడంతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారని, వాళ్లకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.