అక్షరటుడే, సిరికొండ: మండలంలోని కొండూర్ శివారులో మధ్య వాగు బ్రిడ్జి వద్ద అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆర్ఐ గంగరాజం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సదరు ట్రాక్టర్లు సరిపల్లి తండాకు చెందిన మలావత్ బాలాజీ, మలావత్ భాస్కర్ కు సంబంధించినవని తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్ఐ ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిరికొండ ఎస్ హెచ్ వో బాల్ సింగ్ తెలిపారు.