అక్షరటుడే, ఇందూరు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య బుధవారం ఉదయం నగరంలోని ఆయా మైదానాల్లో వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. దీంతో ఉపాధ్యాయులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. తమ మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, కొండ ఆశన్న, తపస్ ప్రతినిధులు ఉన్నారు.