అక్షరటుడే, వెబ్​డెస్క్: బర్డ్​ఫ్లూ వైరస్​ వ్యాపిస్తుండటంతో తెలంగాణలో చికెన్​ రేట్లు పడిపోతున్నాయి. బర్డ్​ ఫ్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్​ కొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్​లో 50శాతం చికెన్​ అమ్మకాలు తగ్గినట్లు తెలిసింది. మొన్నటి వరకు రూ.200పైగా ఉన్న కిలో చికెన్​ రూ.150కి దిగి వచ్చింది. మరోవైపు ఏపీలో ఇంకా బర్డ్​ ఫ్లూ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లాలోనూ వైరస్​ సోకింది. దీంతో ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్ల వాహనాలను అధికారులు అనుమతించడం లేదు.