అక్షరటుడే, వెబ్‌డెస్క్: బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తుండడంతో హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్‌పురా అన్నానగర్‌లో చికెన్ షాపులపై శుక్రవారం దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా కుళ్లిన చికెన్ గుర్తించారు. 5 క్వింటాళ్లకు పైగా చికెన్ సీజ్ చేశారు. ఈ చికెన్‌ను వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్టు గుర్తించారు. కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్‌లో మూడు నెలలుగా నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు.