అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కిరణ్మయి బస చేశారు. ప్రిన్సిపల్, సిబ్బందితో సమీక్షించారు. వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.