అక్షరటుడే, న్యూఢిల్లీ: అక్రమ వలసదారులతో మూడో అమెరికా విమానం ఆదివారం భారత్‌కు చేరుకుంది. అమృతసర్‌లోని శ్రీగురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది. ఈ విడతలో 112 మంది భారతీయులను అమెరికా పంపించింది. వీరిలో 44 మంది హరియాణాకు చెందిన వారు. 33 మంది గుజరాత్‌కు చెందినవారు, పంజాబీలు 31 మంది, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.