అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు సమావేశం కానున్నారు. తీవ్రవాదం, నక్సలిజం, డ్రగ్స్, ఆయుధాల రవాణాతో పాటు అంతర్ రాష్ట్ర వివాదాలు, ఎర్రచందనం నేరాలపై సమీక్షించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీలతో పాటు ముఖ్య అధికారులు పాల్గొననున్నారు.