అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. 1,286 మంది అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి 19 వరకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఇందులో మల్టీజోన్–1కు 659 మందిని, మల్టీ జోన్–2కు 627 మంది అభ్యర్థులను కేటాయించారు. మెరిట్ ఆధారంగా కాలేజీలకు లెక్చరర్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.