అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి రౌండ్లలో ఎన్టీయే కూటమికి ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 2200 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం కాస్త తేరుకుని సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.