అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తాను కల్వకుంట్ల కవిత లాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీని ఆదర్శంగా తీసుకుని రాజకీయల్లోకి వచ్చానని.. కానీ, తన రాజకీయ గురువు మాత్రం తండ్రి డి.శ్రీనివాస్‌ అని వివరించారు. ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడం బీజేపీ పని అయితే.. నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌ కుటుంబం పని అని విమర్శించారు.