అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కొద్దిరోజులుగా వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. గురు, శుక్రవారాల్లో ఒక డిగ్రి సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదయం మంచు కురుస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.