అక్షరటుడే, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. దేశం దృష్టిని ఆకర్షించిన ఎలక్షన్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి 140కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు వైసీపీకి చెందిన చాలా మంది మంత్రులు వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ పార్టీ కేవలం 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.