అక్షరటుడే, బాన్సువాడ: కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్​ కాసుల బాలరాజ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి ఓట్లు వేయించాలని సూచించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికపై కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్​ యమరాములు, అంజిరెడ్డి, రఘు, విజయ ప్రకాశ్​, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.