అక్షరటుడే, కామారెడ్డి: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను ఆయన ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను తెలుసుకున్నారు. పట్టణంలో పలువురు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఎంత ఎక్కువగా ఉంటే పట్టణం అంత ప్రశాంతంగా ఉంటుందన్నారు. అనంతరం పలువురు దాతలను ఐజీ సన్మానించారు. ఎస్పీ సింధుశర్మ, ఏఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.