అక్షరటుడే, వెబ్డెస్క్: జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశతో వెనుదిరిగారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ ప్రస్తుతం 18వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీబీ పాటిల్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది.