అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. స్థానికంగా ఉన్న పనిచేయని బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. పట్టణంలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజూ నిర్వహించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, అమృత్ పథకం క్రింద చేపడుతున్న పనులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతరం డీఆర్సీసీ కేంద్రం, సెగ్రిగేషన్ షెడ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రమేష్, తహశీల్దార్ మహేందర్, ఇన్ఛార్జి ఎంపీడీవో ప్రకాష్, పలు శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.