అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేశారు. దీంతో బంగ్లాదేశ్​ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న బంగ్లాదేశ్​ జట్టు షమీ, అక్షర్​ పటేల్​ దెబ్బకు 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో వంద పరుగులు కూడా చేస్తుందో లేదో అనుకున్న సమయంలో తావిద్​(100) సెంచరీతో రాణించడంతో పాటు, జాకీర్​ అలీ(68) కీలక ఇన్నింగ్స్​ ఆడి స్కోర్​ బోర్డు 200 పరుగులు దాటించారు. భారత బౌలర్లు షమీ ఐదు వికెట్లు, హర్షిత్​ రాణా మూడు, అక్షర్​ రెండు వికెట్లు తీశారు.