అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం రేఖాగుప్తా హోంశాఖ, ఆర్థిక, విజిలెన్స్‌ శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. పర్వేశ్‌ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్‌ వర్క్స్ అప్పగించారు. రవీందర్‌ ఇంద్రజ్‌కు సాంఘిక సంక్షేమ శాఖ, ఆశిష్‌సూద్‌కు రెవెన్యూ, పర్యావరణ శాఖ, మంజీందర్‌ సింగ్‌ సిర్సాకు ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ, కపిల్‌ మిశ్రాకు పర్యాటక శాఖ, పంకజ్‌ సింగ్‌కు హౌసింగ్‌ శాఖ అప్పగించారు.