అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అధరగొట్టే శుభారంభం చేసింది. ట్రోఫీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి బోణి కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 228 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇండియా స్టార్ బౌలర్ షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్‌గిల్ (101 నాటౌట్) చెలరేగిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్‌లో ప్రేక్షకులను అలరించాడు. శుభ్‌మన్‌గిల్‌కు మద్దతుగా రాహుల్(41), రోహిత్‌శర్మ(41), కోహ్లి 22 పరుగులు సాధించారు. 228 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు.