అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రెండేళ్ల చిన్నారి కడుపులో నుంచి వింత శబ్దాలు వస్తున్న ఘటన వియత్నాంలో వెలుగు చూసింది. ఈ సమస్యతో రెండు వారాల క్రితం సదరు చిన్నారి ఆస్పత్రిలో చేరింది. పాపకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు విస్తుపోయారు. ఆమె కడుపులో 27 చిన్న చిన్న అయస్కాంతాలను గుర్తించి తొలగించారు. ఈ అయస్కాంతాల కారణంగా చిన్నారి పేగు, కడుపులో చిల్లులు పడినట్లు డాక్టర్లు తెలిపారు.